ఇస్రో ‘కౌంట్‌ డౌన్’ విధుల ఉద్యోగిని మృతి

చంద్రయాన్-3 సహా పలు కీలక మిషన్లలో కౌండ్ డౌన్ విధులు నిర్వహించిన శాస్త్రవేత్త

isro-valarmathi-succumbs-to-heart-attack

బెంగళూరుః భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రోలో విధులు నిర్వహిస్తున్ను ఓ ప్రముఖ శాస్త్రవేత్త తాజాగా మరణించారు. ఇస్రో చేపట్టే ప్రయోగాలు ఎంత ముఖ్యమో.. ప్రయోగానికి ముందు చేపట్టే కౌంట్‌డౌన్‌ ప్రక్రియకు అంత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ఆ సమయంలో గంభీరమైన స్వరం వినిపించే ఓ ఉద్యోగిని మృతి చెందారు. ఇస్రోలో కౌంట్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్న వలర్మతి (50) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రయాన్‌-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చివరి సారిగా చంద్రయాన్‌-3కి తన స్వరం వినిపించారు.