కేంద్ర మంత్రి గ‌డ్క‌రి, జగన్ ల చేతుల మీదుగా క‌న‌కదుర్గ ఫై ఓవ‌ర్ ప్రారంభం

వర్చువల్‌ కార్యక్రమం ద్వారా జాతికి అంకితం

YouTube video

Vijayawada : కనకదుర్గ ఫ్లైఓవర్ ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, వీకే సింగ్‌, మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీ కేశినేని నాని, కనకమేడల, సీఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. రూ. 502 కోట్లతో 6 వరుసలతో 2.6 కి.మీ మేర ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగింది.

కాగా దుర్గగుడి ఫ్లైఓవర్‌తో పాటు రాష్ట్రంలో 61 కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  మొత్తం రూ.15,592 కోట్ల పనులకు భూమి పూజ నిర్వహించారు. 16 ప్రాజెక్టులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేసారు

9 జాతీయ రహదారుల ప్రాజెక్టులు జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న దుర్గగుడి ఫ్లైఓవర్‌ కల సాకారమైందన్నారు. ఇది రాష్ట్ర ప్రగతిని మార్చే ప్రాజెక్ట్ అన్నారు.

విజయవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తొలగనున్నాయని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/