చైనా పై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ స్పందన

Australian Prime Minister Scott Morrison
Australian Prime Minister Scott Morrison

చైనా ఆహార అలవాట్లపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కుక్కలు, పిల్లులు, ఎలుకలు వంటి ఏ జంతు వును కూడా వదలకుండా తినడంపై చైనాపై అన్ని దేశాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నా యి.

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్‌.. వెలుగు చూసిందీ ఎక్కువగా మాంసం విక్రయించే వుహాన్‌ నగరం నుంచే..

దీంతో కొన్నాళ్లు ఆ దుకాణాలను మూసివేసినా.. మళ్లి వాటి విక్రయాలు ఊపందుకున్నాయి. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తీవ్రంగా స్పందించారు.

చైనా ఆహార మార్కెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ, ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు.

ప్రాణాంత క కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమైన సదరు మార్కెట్లు ప్రపంచానికి సమస్యగా పరిణమించాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

చైనా మార్కెట్లో అన్ని జంతువుల మాంసం అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతుండటంతోనే ప్రాణాంతక వైరస్‌లు పుట్టుకొస్తున్నాయని విమర్శించారు.

తడి మార్కెట్లు (అపరిశుభ్ర మాంసం మార్కెట్లు) కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అందరికీ తెలుసు అని మారిసన్‌ అన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/