పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు ఒకటే

మేనిఫెస్టోలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చెప్పినా ఇంటర్‌ వరకు పొడిగించాం

ys jagan mohan reddy
ys jagan mohan reddy

చిత్తూరు: మేనిఫెస్టోలో ఒకటి నుంచి పదో తరగతి వరకు అని చెప్పినా అమ్మ ఒడి పథకాన్ని ఇంటర్‌ వరకు పొడిగించామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. చితూరు జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్‌ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియాం ప్రవేశపెడతామని అన్నారు. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకూడదన్నారు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు ఒకటేనని ముఖ్యమంత్రి జగన్‌ గుర్తు చేశారు. 43లక్షల మంది తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు జమచేస్తామన్నారు. దాదాపు 81లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని వచ్చే ఏడాది నుంచి 75శాతం విద్యార్థుల హాజరు తప్పని సరి చేస్తామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/