ఆస్పత్రి ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని

మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా..గాయపడినవారికి 50వేల సాయం

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి అహ్మ‌దాబాద్‌లోని శ్రేయ్ హాస్పిట‌ల్‌లో చోటు చేసుకున్న ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ప్రధాని మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున, గాయ‌ప‌డ్డ వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రధాని మోడి ప్రకటించారు. కాగా శ్రేయ్ ఆస్ప‌త్రిలో జ‌రిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై గుజ‌రాత్ సిఎం విజ‌య్ రూపానీ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని హోంశాఖ‌ను ఆదేశించారు. హోంశాఖ అడిష‌న‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ సంగీత సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీని ఏర్పాటు చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/