తెదేపాకు సీనియర్‌నేత గద్దె బాబూరావు గుడ్‌బై

పార్టీ విధానాలు నచ్చకే రాజీనామా చేసినట్టు ప్రకటన

Gadde Baburao
Gadde Baburao

విజయనగరం: తెదేపా విధానాలు నచ్చకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్‌ నేత గద్దె బాబూరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతోమాట్లాడారు.

తనకు ఎవరిమీద నిందలు వేయటం ఇష్టం లేదని, ఆత్మగౌరవం, ఆత్మసంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగిందన్నారు..

అందుకే తాను తెదేపాకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఎంతోమంది నచ్చజెప్పారని కానీ నా రాజీనామా నిర్ణయం మార్చుకోలేదన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో తెదేపా అభ్యన్నతికి ఎంతో కృషిచేసానని తెలిపారు..

ఎటువంటి సపోర్ట్‌లేకుండా రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎమ్మెల్సీగా చేశానన్నారు.. చీపురుపల్లి ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నారు..

తాను ఏ పార్టీలోకి వెళ్లాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఏ పార్టీలోచేరాలి అనే నిర్ణయం తీసుకుంటానని ఆయన సేర్కొన్నారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/