తెలంగాణ పోరాట స్ఫూర్తినే తనను ఇవ్వాళా ఇక్కడి వరకు తెచ్చింది – పవన్ కళ్యాణ్

తెలంగాణ పోరాట స్ఫూర్తినే తనను ఇవ్వాళా ఇక్కడి వరకు తెచ్చింది - పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లో స్పీడ్ పెంచారు. కేవలం ఏపీ రాజకీయాల ఫైనే కాదు తెలంగాణ రాజకీయాల ఫై కూడా దృష్టి సారించారు. శనివారం తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భాంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై నుంచే జనసేన పార్టీని ప్రారంబించానని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపించటానికి కృషి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ పోరాట స్పూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తన గుండెలో ధైర్యాన్ని నింపిందని అన్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు 2009 లో తాను తిరిగానని వెల్లడించారు. ఓడిపోయినా ప్రజల కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు .

రాజకీయ చదరంగంలో ఒక్క అడుగైనా ఆలోచనతో ముందుకు వెయ్యాలని తెలిపారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్న పవన్ కళ్యాణ్… రాజకీయాల్లో డబ్బుతో- పేరుతో పని లేదని.. కేవలం బలమైన భావజాలం ఉంటే చాలు అని వెల్లడించారు. మార్పు కోసం వచ్చిన పార్టీ జనసేనా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్ర పాలకులను తెలంగాణ నాయకులు బద్దశత్రువులుగా చూశారని విమర్శించారు. ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువులు కాదని, సమస్యలు మాత్రమే శత్రువలని పేర్కొన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఖండిస్తానని పవన్‌కల్యాణ్ అన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తినే తనను ఇవ్వాళ ఇక్కడి వరకు తెచ్చిందని స్పష్టం చేశారు.