దేశంలో కొత్తగా 38,792 కరోనా పాజిటివ్ కేసులు

624 మంది మృతి

Covid Tests-File
Covid Tests-File

New Delhi: దేశంలో తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 624 మంది మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 41వేల మంది కరోనా నుంచి కొలుకున్నారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 3,09,46,074కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య‌ 3,01,04,720కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,29,946కి చేరింది. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,11,408 కి పెరిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/