బంగార్రాజు నుండి లడ్డు అంటూ ఊర మాస్‌ సాంగ్‌ విడుదల

కింగ్ నాగార్జున , చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడి యోస్‌ పతాకం పై నాగార్జున నిర్మిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి అదిరిపోయే ఊర మాస్‌ సాంగ్‌ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌ ను స్వయంగా నాగార్జునే పాడాడు. గార్జున పాడటం ఒక ఎత్తైతే… ఈ పాట పూర్తి గా మాస్‌ సాంగ్‌ కావడం విశేషం. దీంతో మాస్‌ ప్రేక్షకులను ఈ సాంగ్‌ బాగా ఆకట్టుకుంటోంది.

YouTube video