పవన్‌కు ముద్రగడ లేఖను తాము ఖండిస్తున్నాముః కూసంపూడి శ్రీనివాస్

ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలని హితవు

kusampudi-fires-on-mudragada-padmanabham

అమరావతిః వీధి రౌడీలా మాట్లాడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖను రాసిన సంగతి తెలిసిందే. తన లేఖలో పలు అంశాలకు సంబంధించి పవన్ పై ముద్రగడ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు ముద్రగడ లేఖపై జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ మండిపడ్డారు. ముద్రగడ లేఖను తాము ఖండిస్తున్నామని చెప్పారు. పవన్ ను, ఆయన కుటుంబ సభ్యులను ద్వారంపూడితో పాటు పలువురు వైఎస్‌ఆర్‌సిపి నేతలు మూతులు తిట్టినప్పుడు ముద్రగడం ఎందుకు స్పందిచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి నేతల వ్యాఖ్యలను ఎందుకు ఖండిచలేదని ప్రశ్నించారు. ఇతరులకు ప్రశ్నలు వేయడం, సలాహాలు ఇవ్వడం ఆపేసి… మనమెంత బాధ్యతగా వ్యవహరిస్తున్నమో ఆలోచించుకోవాలని హితవు పలికారు.