సినీ ప్రముఖుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత

కృతి సనన్ కామెంట్

Kriti Sanon
Kriti-Sanon-Shocking-Comments-on-About-Film-Industry

కృతి సనన్ సినీ రంగంలో ఉన్న నట వారసులపై కామెంట్ చేస్తూ.. టాలెంట్ ఉన్నా లేకపోయినా సినీ వారసులకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. ఇండస్ట్రీలో సినీ ప్రముఖుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు చేసింది.

వారికి ఓ సినిమా ఫ్లాప్ అయితే మరో అవకాశం దక్కుతోంది కానీ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వాళ్లకు మాత్రం ఒక్క ఫ్లాప్ వస్తే మరో అవకాశం రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో బంధు ప్రీతి బాగా ఉందని.. అది చాలా తప్పని చెప్పుకొచ్చింది.

బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కొందరు సొంతంగా తమ కాళ్లపై నిలబడ్డారని.. కానీ కొందరు మాత్రం బ్యాగ్రౌండ్ ఉన్నా ఫెయిల్ అయ్యారని పేర్కొంది.

వారసత్వం అనేది ఎంట్రీ వరకు ఉంటే ఫర్వాలేదు గానీ.. వాళ్ళకే ఛాన్సెస్ ఇస్తూ ఎంకరేజ్ చేయడం సరికాదని కృతి సనన్ అభిప్రాయపడింది.

వాస్తవానికి బాలీవుడ్ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు.

ఇంతకముందు కూడా చాలా మంది హీరో హీరోయిన్స్ బ్యాగ్రౌండ్ లేనివారిని బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోరని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/