టీడీపీ లో చర్చ కు దారి తీసిన ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు

గత కొద్దీ రోజులుగా ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి టీడీపీలో చర్చ కు దారితీస్తుంది. చంద్రబాబు తో అంటీముట్టనట్లు ఉండడం..సొంత పార్టీ నేతలపై పలు వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో కార్య కర్తలు రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో విజయవాడ పాతబస్తీ జెండా చెట్టు వీధిలో నూతనంగా నిర్మించిన పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవం లో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీసాయి. ఇళ్లలో కూర్చుని మాట్లాడుతూ.. ఎక్కడో ఉండి తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని నాని అన్నారు. కొంత మంది మీడియాలో ప్రత్యక్షమై నాయకులు అయిపోవాలని చూస్తుంటారని.. నేతలు మీడియాలో నుంచి కాదు, ప్రజల్లో నుంచి వస్తారన్నారు.

జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక విజయవాడకు కృష్ణానది, దుర్గగుడి, భవానీ ద్వీపం వచ్చాయని.. జగన్‌ లేకపోతే విజయవాడ లేదనట్లు వైస్సార్సీపీ నేతలు ప్రచారం ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌ వచ్చాక విజయవాడ మొత్తం నాశనమైందని.. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి లో చలనం లేదని.. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వివాదం చేశారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే కుల, మతాలకు అతీతమని వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజలు పార్టీని-పార్టీ తరఫున పోటీ చేసే మనిషిని చూసే కాకుండా.. వ్యక్తిత్వం వంటివి చూసి ఓట్లు వేస్తారన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. అయితే తొడల కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని కేశినేని సొంత పార్టీ నేతల్ని ఉద్దేశించి అన్నారా అనే చర్చ జరుగుతోంది

జగన్‌ వచ్చాక విజయవాడకు కృష్ణానది, దుర్గగుడి, భవానీ ద్వీపం వచ్చాయని.. జగన్‌ లేకపోతే విజయవాడ లేదనట్లు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రచారం ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌ వచ్చాక విజయవాడ మొత్తం నాశనమైందని.. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ లేదని నిన్న కేంద్రం తెగేసి చెప్పిందని.. కానీ చేతకాని ముఖ్యమంత్రిగా జగన్‌ ఉన్నారని ధ్వజమెత్తారు. సీఎంలో చలనం లేదని.. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వివాదం చేశారన్నారు.