రేపు మొయినాబాద్ ఫాంహౌస్ లో కృష్ణం రాజు అంత్యక్రియలు

రెబెల్ స్టార్ కృష్ణం రాజు అంత్యక్రియలు రేపు సోమవారం మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్ లో జరగబోతున్నాయి. ముందుగా జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరపాలని అనుకున్నప్పటికీ ..తర్వాత ఫాంహౌస్ లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద ఉంచారు. రేపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు.

గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు..ఈరోజు ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని సందర్శనార్థం జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. కడసారి ఆయన్ను చూసేందుకు అభిమానులు , సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు పెద్ద ఎత్తున తరలివస్తు ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. చంద్రబాబు , బండి సంజయ్ , కేటీఆర్ , కిషన్ రెడ్డి , సుబ్బిరామిరెడ్డి లతో పాటు చిత్రసీమ నుండి చిరంజీవి , కృష్ణ , మోహన్ బాబు , వెంకటేష్ , మహేష్ , పవన్ , ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , అనుష్క మొదలగువారు నివాళ్లు అర్పించారు.