గరికపాటి ఇష్యూ ఫై నోరువిప్పిన చిరంజీవి

గత వారం రోజులుగా మీడియా లో గరికపాటి నరసింహారావు పేరు మారుమోగిపోతుంది. దీనికి కారణం ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో చిరంజీవి ఫై ఆగ్రహం వ్యక్తం చేయడమే. రీసెంట్ గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిరంజీవి తో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు , ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను గరికపాటి , చిరంజీవి లైట్ తీసుకున్నప్పటికీ మెగా అభిమానులు , చిత్రసీమలో కొంతమంది వ్యక్తులు ఈ ఇష్యూ ఫై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ..గరికపాటిని టార్గెట్ చేసారు.

రోజు రోజుకు ఈ ఇష్యూ మరింత పెద్దవుతున్న నేపథ్యంలో చిరంజీవి దీనిపై స్పందించారు. ” ఆయన పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు” అని తెలిపారు. మరి చిరంజీవి స్పందనతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అవుతుందో లేదో చూడాలి. ఇక రీసెంట్ గా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. ఆచార్య తో ప్లాప్ అందుకున్న చిరు..గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టడం తో మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు , చిత్ర యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.