తన రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం అయ్యిందన్న రాజగోపాల్

కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్..నియోజకవర్గం లో దూకుడు పెంచారు. ప్రతి పల్లెల్లో పర్యటిస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఓ పక్క ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికీ హామీ ఇస్తూనే టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ లపై విరుచుకపడుతున్నారు. ఈరోజు గట్టుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తన రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం అయ్యిందని , ఇదే కాకుండా.. నియోజకవర్గంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక గట్టుప్పల్ ను మండలం చేయడానికి.. స్థానికి సర్పంచిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని రాజగోపాల్ విమర్శించారు. టిఆర్ఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తుందని , తాను మునుగోడు ప్రజల కోసం ధర్మ యుద్ధం చేస్తున్నానని.. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. అభివృద్ధి కెసిఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు.

తాను స్వార్థం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం, పార్టీ మారలేదని స్పష్టం చేశారు. నేను రాజీనామా చేశాను కాబట్టే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు మంజూరయ్యాయన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాతే నియోజకవర్గంలో రోడ్లు, గట్టుపల్ మండలం గా ఏర్పడిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని మరోసారి స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి.