హాట్ కేకుల తయారీతో టైం పాస్

సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ పోస్ట్

హాట్ కేకుల తయారీతో టైం పాస్
Nidhi Agarwal

నిధి అగర్వాల్.. యూత్ లో ఆమెకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ – వయ్యారాలు ఒలకబోసే ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది.

ఈమె ఫోటోల కోసం నెటిజన్లు ఆరాటంగా వెయిట్ చేస్తూ ఉంటారు. హిందీ సినిమా ‘మున్నా మైఖేల్’తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిధి అగర్వాల్..

తొలి సినిమాతోనే అందాలు ఆరబోస్తూనే తన డాన్సులతో అదరగొట్టింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇంటికే పరిమితమైన సెలెబ్రెటీల రకరకాల ఫొటోలు వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు లేక ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్న ఈ బ్యూటీ తనలో దాగివున్న టాలెంట్ ను బయటకి తీసే పనిలో పడింది. మొన్నటి దాకా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచిన ఈ భామ ఇప్పుడు హాట్ కేకులు తయారు చేస్తూ సమయం గడుపుతోంది.

కేక్స్ బేక్ చేస్తూ – వాటిని టేస్ట్ చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/