నందమూరి కుటుంబం ఫై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

నందమూరి కుటుంబం ఫై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Kodali Nani

వైసీపీ మంత్రి కొడాలి నాని మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. మా జగన్ చెబితే వింటాం కానీ.. జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినేందేంటూ నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేయడమేంటిని ప్రశ్నించారు. తాను, వల్లభనేని వంశీ సెక్యూరిటీ తీసేసి వస్తామని.. చంద్రబాబు తీసేసి వస్తారా అంటూ సవాల్ విసిరారు. నందమూరి కుటుంబం అంటే ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఉంటుందని, వాళ్లు అమాయకులు…ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ పార్టీ నాశనం అవుద్దని చంద్రబాబు చెప్పినా విన్నారు. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది..చంద్రబాబు ఏది చెప్పినా నమ్మేస్తారు. అంటూ నందమూరి కుటుంబాన్నిఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు నందమూరి కుటుంబంతో కలిసి ఉన్నామని.. విబేధాలతో బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తమకేం సంబంధం లేదంటూ తెలిపారు. ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై కొడాలి నాని గురువారం మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డిని వేధించిన సోనియా గాంధీ నుంచి చంద్రబాబు, లోకేష్ వరకు అందరూ సర్వనాశనమైపోయారని కొడాలి నాని అన్నారు. వైఎస్ జగన్‌కు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని.. ఇలాంటి వారి వేధింపులు ఏం చేయలేవన్నారు. భార్యను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయడం హేయనీయమని చంద్రబాబును విమర్శించారు.