మంత్రి వర్గంలో చోటు దక్కకపోయినప్పటికీ..కొడాలి నానికి కీలక పదవి దక్కింది

kodali nani as ap state development board chairman
kodali nani as ap state development board chairman

ఏపీ కొత్త మంత్రివర్గం ఖరారైంది. గత కొద్దీ రోజులుగా యావత్ రాష్ట్ర ప్రజలు , రాజకీయ నేతలు , వైసీపీ నేతలు ఇలా ప్రతి ఒక్కరు కొత్త మంత్రి వర్గం ఫై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరికీ మంత్రి పదవి దక్కుతుందో..ఎవరికీ దక్కదో..అని ఆత్రుత తో ఉన్నారు. ఇక వారి ఆతృతను తెరదించారు. మొత్తం 25 మందితో కూడిన సభ్యుల జాబితా ను ప్రకటించారు. 10 మంది పాత మంత్రులు, 15 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ కూర్పు చేశారు.

బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పి. రాజన్నదొరకు చోటు దక్కింది. గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, జొన్నలగడ్డ పద్మావతికు కేబినెట్ బెర్త్ కన్‌ఫామ్ అయ్యింది. ఇక నిన్నటి వరకు కొడాలి నాని కి తప్పకుండా మరోసారి ఛాన్స్ ఇస్తారని అంత అనుకున్నారు కానీ ఇవ్వకుండా కీలక పదవి ఇచ్చారు.

గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్‌ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు.

ఇక 25 మందితో కూడిన కొత్త మంత్రివర్గ సభ్యులు వీరే..

 • గుడివాడ అమర్నాథ్‌
 • దాడిశెట్టి రాజా
 • బొత్స సత్యనారాయణ
 • రాజన్నదొర
 • ధర్మాన ప్రసాదరావు
 • సీదిరి అప్పలరాజు
 • జోగి రమేష్‌
 • అంబటి రాంబాబు
 • కొట్టు సత్యనారాయణ
 • తానేటి వనిత
 • కారుమూరి నాగేశ్వరరావు
 • మేరుగ నాగార్జున
 • బూడి ముత్యాలనాయుడు
 • విదుదల రజిని
 • కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 • అంజాద్‌ భాష
 • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 • బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 • పినిపె విశ్వరూప్‌
 • గుమ్మనూరు జయరాం
 • ఆర్కే రోజా
 • ఉషశ్రీ చరణ్‌
 • తిప్పేస్వామి
 • చెల్లుబోయిన వేణుగోపాల్‌
 • నారాయణస్వామి లకు మంత్రివర్గ చోటు ఇచ్చారు. సోమవారం ఉదయం ఏపీ నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.