అగ్నిప‌థ్ ప‌థ‌కం కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడిందంటూ బాంబ్ పేల్చిన కిషన్ రెడ్డి

kishan reddy
kishan reddy

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కిం పట్ల దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని వెంటనే వెనక్కు తీసుకోవాలంటూ ఆర్మీ విద్యార్థులు , రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఎవరు ఎన్ని ఆందోళనలు చేసిన అగ్నిప‌థ్ ను వెనక్కు తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేయడమే కాదు , అగ్నివీర్ కు సంబదించిన నోటిఫికేషన్ ను సైతం విడుదల చేసింది. ఇదిలా ఉంటె తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్నిప‌థ్ విషయంలో పెద్ద బాంబ్ పేల్చాడు.

అగ్నిప‌థ్ ప‌థ‌కం ఇప్పుడు రూపుదిద్దుకున్న ప‌థ‌కం కాద‌ని పేర్కొన్న కిషన్‌ రెడ్డి.. 1999లో కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే ఈ ప‌థ‌కానికి బీజం పడిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ పథకం అమలు పెండింగ్ లో ఉందని వివరించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా అమలు కాలేదన్నారు. ఈ స్కీంతో దేశానికి మంచే తప్పా.. ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. సైన్యంలో పని చేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని..వారంతా అగ్నిపథ్‌ లో చేరవచ్చన్నారు. అగ్నివీరులకు సైన్యం నుంచి బయటికి వచ్చాక బిజినెస్‌, ఉద్యోగాల్లోనూ రాణించే అవకాశాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు. మహీంద్ర లాంటి కంపెనీలు సైతం అగ్నివీరులందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని వివరించారు. మరోపక్క కేంద్రం అగ్నివీర్ కు సంబదించిన నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. నిజంగానే కాంగ్రెస్ హయాంలో అగ్నిపథ్ ఏర్పడిందా అనేది కాంగ్రెస్ వారే చెప్పాలి.