జిన్‌పింగ్‌ పై కిమ్‌ జోన్‌ ఉన్‌ పొగడ్తలు

కరోనాపై విజయం సాధించినందుకు అభినందనలు..ఈ మేరకు సందేశం పంపిన కిమ్

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కరోనాపై పోరాటంలో విజయం సాధించినందుకు జిన్‌పింగ్‌కు కిమ్‌అభినందనలు తెలుపుతు ఓ సందేశాన్ని పంపారని ఉత్తరకొరియా మీడియా పేర్కొంది. ఈసందేశంలో జిన్ పింగ్ ఆరోగ్యంగా ఉండాలని కిమ్ ఆకాంక్షించారని చెప్పింది. సమర్థుడైన జిన్‌పింగ్‌ నాయకత్వంలోని చైనీస్‌ పార్టీ, చైనా ప్రజలు కరోనా‌పై పైచేయి సాధించారని కిమ్ ప్రశంసలు కురిపించారని తెలిపింది. కాగా, 20 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి, తిరిగి వచ్చిన అనంతరం కిమ్ జోంగ్‌ ఉన్ చైనాకు ఇటువంటి సందేశం పంపారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ఇప్పటివరకు ఉత్తరకొరియాలోకి ప్రవేశించలేదని తెలుస్తోంది. చైనాకు మిత్రదేశమైన ఉత్తర కొరియాలో ఒక్కపాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం పట్ల ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/