స్లీవ్‌లెస్‌తో మతిపోగొడుతున్న కీర్తి సురేష్

స్లీవ్‌లెస్‌తో కీర్తి సురేష్ మతిపోగొడుతోంది. నేను శైలజ మూవీ తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే చక్కటి విజయం అందుకొని యూత్ కు దగ్గరైంది. ఆ తర్వాత నేను లోకల్ , మహానటి తో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవ్వడమే కాదు ఎన్నో అవార్డ్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. మహేష్ బాబు సరసన సర్కార్ వారి పాట చిత్రంతో అసలైన హిట్ అందుకుంది. ఈ సినిమాలో తనలోని అసలైన గ్లామర్ చూపించి అందరికి షాక్ ఇచ్చింది.

మొదటి నుండి కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడంతో ఈమె వెనుక వచ్చిన హీరోయిన్లంతా వరుస ఛాన్సులతో టాప్ పొజిషన్ కు వెళ్తే..కీర్తి మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇక ఇలాగైతే కుదరదని అనుకుందో ఏమోకానీ ఫస్ట్ టైం సర్కార్ వారి పాట లో అందాల ఆరబోత చేసి అబ్బో అనిపించింది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను అమ్మడు రెచ్చిపోతుంది. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్… వైట్ క‌ల‌ర్ శారీ.. దానిపై పువ్వుల డిజైన్ ఉన్న డ్రెస్‌తో ఉన్న ఫొటోల‌ను షేర్ చేసింది. ఈ ఫొటోల‌ను చూసిన వారంద‌రూ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో కీర్తి సురేష్ జోరు పెంచింద‌ని, అందులో భాగంగానే ఇలాంటి గ్లామ‌ర్ లుక్ ఫోల‌ను పోస్ట్ చేసింద‌ని అంటున్నారు. చీర‌లోనూ ఇంత గ్లామ‌ర‌స్‌గా ఉంటావా అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కీర్తి సురేష్‌పై మ‌న‌సు పారేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె నాని సరసన దసరా , చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీస్ లలో నటిస్తుంది.