రేపు తెలంగాణ భవన్‌కు రానున్న కెసిఆర్‌

CM KCR's Maharashtra tour canceled
KCR

హైదరాబాద్ః బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ రేపు తెలంగాణ భవన్‌ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఇక నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక నియోజక వర్గంలో మాజీ సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందట. ఈ నెల మూడో వారంలో కెసిఆర్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కెసిఆర్ భారీ బహిరంగ సభ ఉంటుంది.

కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది.నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూ పై పోరాటానికి బిఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు కెసిఆర్‌ దిశానిర్దేశం చేశారు.