నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడం తో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. నవంబర్ 30 న తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు CEC రాజీవకుమార్ వెల్లడించారు. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ లకు సంబదించిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడం జరిగింది.

తెలంగాణ లో నవంబర్ 30 న ఎన్నికలు జరుగగా..డిసెంబర్ 03 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మధ్య ప్రదేశ్ లో నవంబర్ 17 న , రాజస్థాన్ నవంబర్ 23 న , ఛత్తీస్‌గఢ్‌ లో రెండు దశల్లో పోలింగ్ జరగనున్నాయి. నవంబర్ 07 , 17 న జరగనున్నాయి. మిజోరం లో నవంబర్ 07 న ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి న‌వంబ‌ర్ 3వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 3వ తేదీ నుంచి నామినేష‌న్లను స్వీక‌రించ‌నున్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 10. 13న స్క్రూట్నీ నిర్వ‌హించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 15. న‌వంబ‌ర్ 30వ తేదీన ఎన్నిక‌లు నిర్వ‌హించి, డిసెంబ‌ర్ 3న కౌంటింగ్ చేయ‌నున్నారు. తెలంగాణ‌లోని 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒకే విడుత‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ నామినేష‌న్ల దాఖ‌లు కార్య‌క్ర‌మంలో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . అనంతరం గజ్వేల్‌లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖ‌లు చేస్తారు. అనంతరం మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నట్లు బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.