కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు – కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి

కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు.. బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని నేను మనసారా కోరుకుంటున్న అన్నారు కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి. దసరా పర్వదినాన టిఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి జనతాదళ్ (ఎస్) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి సైతం హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కర్నాటకలో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు దేశమంతా కేసీఆర్‌తో కలిసి తిరుగుతారని తెలిపారు. తెలంగాణ పథకాలు బాగున్నాయన్న ఆయన.. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలన్నారు. కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడని, బీఆర్‌ఎస్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ పార్టీ ఆవిర్భవించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కర్నాకటలో రాబోయే ఎన్నికల్లో BRS జెండా ఎగుర వేయాలని కేసీఆర్ అన్నారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్న కేసీఆర్‌.. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్‌ఎస్‌ను రాష్ట్రానికే పరిమితం చేస్తే అని చాలా మంది తనను అడిగినట్లు చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, తెలంగాణ మోడల్‌ దేశంలో అమలు కావాలని కేసీఆర్‌ చెప్పారు. బంగ్లాదేశ్‌కంటే వెనుకబడడమేంటని ప్రశ్నించారు. దేశ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.