కేసీఆర్ బీఆర్ఎస్‌ ప్రకటన ఫై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ..సినిమాల పరంగా పెద్దగా వార్తల్లో నిలువకపోయినప్పటికీ, సోషల్ మీడియా లో తరుచు ఏదొక ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకం. కేవలం సినిమాల ఫైనే కాదు రాజకీయాల ఫై కూడా ట్వీట్స్ చేస్తుంటాడు. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్‌ ప్రకటన ఫై ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

దసరా పర్వదినాన టిఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై టిఆర్ఎస్ ‘బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి )’ గా మారింది. కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీపై రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

తాజాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బీఆర్ఎస్ పార్టీపై తనదైన స్టైల్లో స్పందించారు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ ఉండే రాంగోపాల్ వర్మ..బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ‘టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యాడు. జాతీయ రాజకీయాలకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై నెటిజన్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కేసీఆర్‌ను వర్మ ఆదిపురుష్ అనడంతో ఇది పొగడ్తా ? విమర్శా ? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.