ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్‌సాస్ రైఫిళ్లు స్వాధీనం

encounter
encounter

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..షోపియాన్‌ జిల్లా తుర్క్‌వాంగమ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందగా, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. భద్రతా బలగాల మూమెంట్స్‌ను పసిగట్టిన ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, సంఘటనా స్థలంలో రెండు ఏకే 47 తుపాకులు, ఇన్సాస్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం రాష్ట్రీయ రైఫిల్‌ స్థావరానికి కూతవేటు దూరంలో ఉండడం గమనార్హం. కాగా, గత 10 రోజుల్లో 19 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/