వివాదాస్పద పాస్టర్​తో రాహుల్ గాంధీ భేటి

“Jesus Christ is the real God, not like Shakti”, controversial

క‌న్యాకుమారిః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తమిళనాడుకు చెందిన వివాదాస్పద కేథలిక్ మత గరువు జార్జ్​ పొన్నయ్యను కలిశారు. అయితే ఆ భేటీకి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. జీసెస్ క్రైస్ట్ ఓ దేవుని రూప‌మే క‌దా, ఇది నిజ‌మేనా అని రాహుల్ అడిగారు. ఆ ప్ర‌శ్న‌కు పాస్ట‌ర్ పొన్న‌య్య బదులిస్తూ.. జీసెస్ నిజ‌మైన దేవుడ‌ని అన్నారు. దేవుడు త‌నంత‌ట తానే ఓ మ‌నిషిలా అవ‌త‌రిస్తాడ‌ని, నిజ‌మైన వ్య‌క్తిలా ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని, శ‌క్తి దేవ‌తాలా కాదు అని, జీసెస్‌లో మాన‌వుణ్ని చూస్తున్న‌ట్లు పొన్న‌య్య తెలిపారు. పాస్ట‌ర్ పొన్న‌య్య గ‌తంలోనూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ, అమిత్ షాతో పాటు డీఎంకే నేత‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసులో గ‌తంలో ఓ సారి పొన్న‌య్య‌ను అరెస్టు చేశారు. పొలియార్‌కురుచ్చిలోని ముట్టిదిచాన్ పారై చ‌ర్చిలో రాహుల్‌, పాస్ట‌ర్ పొన్న‌య్య భేటీ అయ్యారు.

తాజా అంతర్జాతీ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/