చంద్రబాబు వేలుకు ఉన్న ఉంగరం వెనుక అసలు రహస్యం అదేనట..

టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో సింపుల్‌గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ఉన్నప్పటికీ ఆర్భాటాలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతునేతృ.. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రాధారణతో సాధారణంగా కనిపిస్తారు. ప్రస్తుతం చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వేలుకు ఉంగరం ధరించడం కార్తకర్తలో ఆసక్తి కలిగించింది. నిన్న బుధువారం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో జరిగిన మినీ మహనాడులో చంద్రబాబు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో చూపుడు వేలుకు ఉన్న ఉంగరాన్ని కార్యకర్తలు, ప్రజలు గమనించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.

దీనిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఉంగరం వెనుక ఉన్న రహస్యాన్ని తెలిపారు.ఉంగరంలో కంప్యూటర్‌తో అనుసంధానించిన మైక్రో చిప్ ఉందని చెప్పారు. ఈ ఉంగరంతో చాలా ప్రయోజనాలున్నాయన్నారు. ఇది తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో పంపుతుందని తెలిపారు. హార్ట్ బీట్‌ను, నిద్రిస్తున్న తీరును నమోదు చేస్తుందన్నారు. తర్వాతి రోజు కంప్యూటర్‌లో నమోదైన వివరాల ఆధారంగా వైద్యులు తనకు సలహా ఇస్తారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి నాయకుడు, కార్యకర్త ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు హితోపదేశం చేస్తుందని వివరించారు. ఈ మాటలు విన్న వాళ్లు అవునా అంటూ నోళ్లు వెళ్లబెట్టారు.