నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ..మధ్యాహ్నం కోర్టుకు

Kavitha’s ED custody will end today..to court in the afternoon

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించనున్నారు. మరో మూడు రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఇప్పటికే ఈడీ కస్టడీకి తీసుకున్నది. వారిద్దరిని ఒకేసారి ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తున్నది.

ఈ నెల 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకురు వారం రోజులపాటు రౌస్‌ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. నేటితో కస్టడీ ముగియడంతో మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లి కోర్టులో ప్రవేశపెట్టనుంది. కాగా, హైదరాబాద్‌లోని కవిత బంధువుల ఇండ్లపై ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.