ఘోర విమాన ప్రమాదం..భారతీయ బిలియనీర్ సహా ఆరుగురి మృతి

Indian billionaire and son among 6 dead in Zimbabwe plane crash

హరారే: జింబాబ్వేలో జరిగిన ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలినియర్‌, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. భారత్‌కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్‌ పేరుతో మైనింగ్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. అలాగే నికెల్‌, రాగి తదితర లోహాలను శుద్ధి చేస్తుంటారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రైవేట్‌ జెట్‌లో వెళ్తున్న సమయంలో మషావా ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు మరణించారు.

ఈ ఘటన శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని సెసెనా 206గా గుర్తించారు. ఈ సింగిల్‌ ఇంజిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు. సాంకేతిక లోపంతో విమానం గాల్లో ఉన్న సమయంలోనే పేలిపోయినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో హర్పాల్‌తో పాటు ఆయన తనయుడు, మరో నలుగురు మృతి చెందారని.. రంధావా స్నేహితుడు, సినీ నిర్మాత హోప్‌వెల్‌ చినోనో తెలిపారు. అలాగే కంపెనీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. విమాన ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటున్నట్లు పేర్కొంది.