రాజకీయ ఎంట్రీ ఫై నాగార్జున క్లారిటీ

nagarjuna clarity on political entry

కింగ్ నాగార్జున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని , విజ‌య‌వాడ ఎంపీ గా రాబోయే ఎన్నికల్లో ఓ పార్టీ తరుపున బరిలోకి దిగబోతున్నారని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు వైరల్ గా మారాయి. ఈ ప్రచారం చూసి చాలామంది నిజమే కావొచ్చని నాగార్జున ను అడగడం మొదలుపెట్టారు. రోజు రోజుకు ప్రశ్నల తాకిడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రాజకీయ ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఈయన హీరోగా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ది ఘోస్ట్ అనే మూవీ చేసాడు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లతో నాగ్ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. శుక్రవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన నాగార్జున ను రాజకీయ ఎంట్రీ గురించి ప్రశ్నించగా…క్లారిటీ ఇచ్చారు. తాను విజ‌య‌వాడ ఎంపీ గా పోటీ చేస్తాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌లొచ్చిన ప్రతీసారి తాను పోటీచేస్తాన‌ని వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, తాను ఎలాంటి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా. మంచి క‌థ దొరికితే రాజ‌కీయ నాయకుడి పాత్ర‌లో న‌టిస్తాన‌ని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.