ఒమిక్రాన్ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేసిన రాష్ట్ర సర్కార్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రం ..ఆ రాష్ట్రం అనే తేడాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 200 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు చెప్పింది.

ఇక కర్ణాటకలో కేసుల సంఖ్య 19 కి చేరడం..రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపాయడంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది రాష్ట్ర సర్కార్. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది. అపార్ట్‌మెంట్‌లలో డీజేల వినియోగంపై కూడా నిషేధం విధించింది. అంతర్గత ప్రదేశాల్లో 50శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది. భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది.వ్యాక్సిన్ వేసుకోనివారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.