డీకే శివకుమార్ కు కరోనా పాజిటివ్

తనను కలిసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాలన్న శివకుమార్

DK Shivakumar
DK Shivakumar

బెంగాళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కొన్నిరోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని తెలిపారు. ప్రస్తుతం డీకే శివకుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కర్ణాటక రాజకీయ ప్రముఖుల్లో అనేకమంది కరోనా బాధితులయ్యారు.  సిఎం యెడియూరప్ప సహా మాజీ  సిఎం సిద్ధరామయ్య, ఆయన తనయుడు కూడా కరోనా ప్రభావానికి గురయ్యారు. వారే కాదు కొందరు మంత్రులు, శాసనసభ్యులకు సైతం పాజిటివ్ వచ్చింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/