సూర్యాపేటకు బయల్దేరిన సంతోష్‌ బాబు కుటుంబం

family-members-of-santosh-babu-go-to-suryapet

హైదరాబాద్‌: భారత్‌ , చైనా ఘర్షణలో దేశం కోసం ప్రాణాలర్పించిన సూర్యాపేట జిల్లా వాసి కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబు(39) కుటుంబ సభ్యులు ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. సంతోష్ బాబు భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, తదితరులు రిసీవ్ చేసుకున్నారు. వారిని తీసుకువచ్చేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక కాన్వాయ్ ని పంపించారు. సంతోష్ భౌతిక కాయం సాయంత్రం సూర్యపేటకు చేరే అవకాశం ఉంది. సోమవారం రాత్రి లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత సైన్యంపై చైనా ఆర్మీ దాడిచేయడంతో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కర్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/