పాతబస్తీ డబీర్‌పురాలో నాటు తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

పోలీసుల అదుపులో నిందితుడు

Patabasti Dabeer pura
Patabasti Dabeer pura

Hyderabad: సిటీలో ఓ వ్యక్తి గన్‌తో హల్‌చల్‌ చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం పాతబస్తీ డబీర్‌పురా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆయుబ్‌ఖాన్‌తోపాటు మరో ఇద్దరు కలిసి ఆలీ కేఫ్‌లోకి వెళ్లారు. కేఫ్‌లో టీ తాగుతూ ఉండగా, ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.

అంతేకాదు భూవివాదం నుంచి నగదు వ్యవహారం దాకా వచ్చింది.. సహనం కోల్పోయిన ఇద్దరిలో ఒకరు జకీర్‌ తన వెంట తెచ్చిన నాటు తుపాకీతో మరో వ్యక్తి ఆయుబ్‌ఖాన్‌ను బెదిరించారు.. ఒక్కసారిగా గన్‌లోడ్‌ చేసి జకీర్‌ కాల్పులకు బరితెగించాడు.

హోటల్‌లో కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకుసమాచారం అందంటంతో జకీర్‌ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదుచేశౄరు..

జకీర్‌ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.. గన్‌ ఎక్కడి నుంచి తెచ్చాడన్న విషయంపై విచారణ జరుపుతున్న పోలీసులు వెల్లడించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/