పొలిటికల్ ఎంట్రీ ఫై కంగనా క్లారిటీ

కంగనా రనౌత్…పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్. తెలుగు లో ఏక్ నిరంజన్ మూవీ తో ప్రభాస్ కు జోడిగా నటించి మెప్పించిన ఈ చిన్నది..బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. కేవలం సినిమాల పరంగానే కాక నిత్యం వివాదస్పద కామెంట్స్ తో రాజకీయాల్లోను అమ్మడు విపరీతమైన పాపులార్టీ తెచ్చుకుంది. అధికార బీజేపీకి అనుకూల వాదిగా కనిపించే ఈమె..తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చింది.

‘‘రాజకీయాల్లోకి రావడంపై నా వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. రానున్న సినిమాల షూటింగ్ పనులతో నేను తీరిక లేకుండా ఉన్నాను. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది కానీ, నటిగానే. నేను విజయవంతమైన నటిని. 16 ఏళ్లకే నా కెరీర్ ను ప్రారంభించాను. ఎన్నో కష్టాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నాను’’అని కంగనా చెప్పింది. రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తి తన నటనలో ప్రతిఫలిస్తుందన్నారు. రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే తానెప్పుడూ మంచి సినిమాలు తీస్తుంటానన్నారు.

‘‘నేను దేశభక్తురాలిని. నా పనితో నేను ఎంతో బిజీగా ఉంటాను. కనుక దేశానికి మంచి చేసే వారికి పార్టీతో సంబంధం లేకుండా నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’అని కంగనా రనౌత్ తెలిపింది.