రాజకీయాల వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్‌ పార్టీలో జాతీయ రాజకీయాల వ్యవహారాల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ను నియమించారు.ఈ మేరకు తెరాస పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఎమ్యెల్సీగా కల్వకుంట్ల కవిత పని చేస్తుండగా…. ఇప్పుడు ఈ పదవి ఇచ్చారు.

ప్రస్తుతం తెరాస పార్టీ ఆవిర్భావ సభ వేడుక హైదరాబాద్ లోని HICC లో ఘనంగా జరుపుకుంటుంది. మూడు వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. ప్లీన‌రీ స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ ప్రసంగం మొదలుపెట్టారు.

ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఉదయం తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్క‌రించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. జెండా ఆవిష్క‌ర‌ణ అనంత‌రం కేటీఆర్ కేక్ క‌ట్ చేశారు.