కాజల్ తల్లికాబోతుందా..?

చందమామ ఫేమ్ కాజల్ తల్లికాబోతుందా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఇదే చర్చ నడుస్తుంది. లక్ష్మి కళ్యాణం మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కాజల్..చందమామ , మగధీర చిత్రాలతో ఎంతో గుర్తింపు సాధించింది. ఆ తర్వాత వెనకకు చూసుకోవాల్సిన పని లేకుండా అన్ని ఇండస్ట్రీ లలో సినిమాలు చేస్తూ వస్తుంది. యంగ్ హీరోల తో పాటు సీనియర్ హీరోల పక్కన జోడి కట్టిన ఈ భామ..గత ఏడాది గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ వచ్చింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన కాజల్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది ఘోస్ట్’ అనే చిత్రంలో కింగ్ నాగార్జున సరసన నటించేందుకు ఓకే చేసింది. ఈ చిత్ర షూటింగ్ కూడా ఈ మధ్యే మొదలైంది. ఈ సినిమాలో కాజల్‌ రా ఏజెంట్‌గా కనిపించనుంది, అయితే ఇప్పుడు ఈ మూవీ నుండి ఈమె తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం ఆమె తల్లి కాబోతుండడమే అని అంటున్నారు. ఆమె స్థానంలో ఇలియానా లేదంటే త్రిషని తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా రూమర్స్ వినపడుతున్నాయి. మరి నిజంగా కాజల్ తల్లి కాబోతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా తెలియనుంది.