హైదరాబాద్ లో భారీ వర్షం

తెల్లవారు జామునుంచి కుండపోత : నగరవాసుల ఇక్కట్లు

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది.. జూబ్లీహిల్స్, మూసాపేట్, కేపీహెచ్ బి యూసుఫ్ గూడ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్ ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ఇక్కట్లు పడుతున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ , కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/