చిలీపై జూనియర్‌ మహిళా హాకీ జట్టు విజయం

చివరి క్షణాల్లో మూడు గోల్స్‌

Junior women's hockey team

శాంటియాగొ(చిలీ) : అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన భారత జూనియర్‌ మహిళా హాకీ జట్టు చిలీ జూనియర్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 4-2 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. వెనుకంజలో ఉన్న భారత మహిళలు చివరి క్షణాల్లో మూడు గోల్స్‌ సాధించి విజయాన్నందుకున్నారు.

గగన్‌దీప్‌ కౌర్‌(51, 59 నిమిషాల్లో), ముంతాజ్‌ ఖాన్‌(21ని.), సంగీత కుమారి(53ని.) గోల్స్‌ సాధించి జట్టును గెలిపించారు. చిలీ తరఫున అమండ మార్టినెజ్‌(4ని.), డొమింగ లాడర్స్‌(41ని.) గోల్స్‌ సాధించారు. మ్యాచ్‌ ఆరంభంనుంచి భారత జట్టుపై ఒత్తిడి పెంచుతూ నాలుగో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యం ప్రదర్శించింది.

21వ నిమిషంలో ముంతాజ్‌ఖాన్‌ గోల్‌తో స్కోరు సమమైంది. పది నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా భారత క్రీడాకా రిణులు ఒక్కసారిగా విజృంభించి మూడు గోల్స్‌తో ప్రత్యర్థిని చిత్తుచేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/