రోడ్‌సేఫ్టీపై లెజెండరీ క్రికెటర్ల టోర్నీ

Cricket legends
Legendary Cricketers’

హైదరాబాద్‌: క్రికెట్‌కు వీడ్కోలుపలికిన మహామహులు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధం అయ్యారు. వయసు మీదపడుతున్నా రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సై అంటున్నారు. టెస్టులు వన్‌డేల్లో తమ ఆటతో క్రికెట్‌కే వన్నెతెచ్చిన ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్‌లో పోటీపడనున్నా రు. రోడ్డుప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భధ్రతా విభాగం ఆన్‌ అకాడమీ ప్రొఫెషనల్‌మేనేజ్‌మెంట ్‌గ్రూప్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న రోడ్‌సేఫ్టీ వరల్డ్‌సిరీస్‌ 2020తో ఈ దిగ్గజ క్రికెటర్లు మనల్ని అలరించనున్నారు.

ఇప్పటికే ఈరోడ్‌సేఫ్టీ వరల్డ్‌సిరీస్‌ కాన్సెప్ట్‌, జట్ల వివరాలు,షెడూయల్‌ను ఇటీవలే ముంబయి వేదికగా నిర్వహిం చిన ఈ వేడుకలో నిర్వాహకులు తెలిపారు. అన్‌ అకాడమీ రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌సిరీస్‌ టోర్నీలో భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, మాజీ క్రికెటర్లతో కూడిన ఐదు టీమ్‌లు పోటీపడనున్నాయి. ఈ ఐదు టీమ్‌లకు భారత లెజెండ్స్‌ వెస్టిండీస్‌ లెజెండ్స్‌ ఆస్ట్రేలియాలెజెండ్స్‌ శ్రీలంకలెజెండ్స్‌ సౌతాఫ్రికా లెజెండ్స్‌గా నామకరణం చేసారు.

మొత్తం 110 మంది మాజీ ఆటగాల్లు బరిలోకి దిగనుండగా భారత జట్టుకు సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యం వహించనున్నాడు. బ్రియన్‌ లారా, అస్ట్రేలియాబ్రెట్‌లీ, సౌతాఫ్రికా జాంటీరోడ్స్‌, శ్రీలంక తిలకరత్న దిల్షాన్‌ తమ దేశ టీమ్స్‌కు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. తొలి మ్యాచ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆధ్వ ర్యంలోని భారత లెజెండ్స్‌, బ్రియాన్‌లారా సారథ్యంలోని వెస్టిండీస్‌ లెజెండ్స్‌మధ్యమార్చి ఏడున ముంబయి వాంఖడే స్టేడియంవేదికగా జరుగనున్నది.

ఇక 12మందితో భారత జట్టును క్రటించారు. క్రికెటర్లు వీరేంద్ర సెహ్వగ్‌,యువరాజ్‌సింగ్‌; మహ్మద్‌కైఫ్‌, జహీర్‌ఖాన్‌లతో కూడిన 12 మంది సభ్యులపేర్లను వెల్లడించారు. హైదరాబాద్‌ వెటరన్‌క్రికెటర్‌ప్రజ్ఞాన్‌ ఓఝా కూడాఈ రోడ్‌సేఫ్టీవరల్డ్‌సిరీస్‌లోఆడుతున్నాడు. భారత లెజెండ్స్‌ తరపున కెప్టెన్‌గా సచిన్‌టెండూల్కర్‌, సమీర్‌దిగ్‌ వికెట్‌ కీపర్‌గాను, వీరేంద్రసెహ్వాగ్‌,యువరాజ్‌సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, అజిత్‌ అగార్కర్‌, జహీర్‌ఖాన్‌, సంజ§్‌ు బంగర్‌, మునాఫ్‌ పటేల్‌; మహ్మద్‌కౌఫ్‌,ప్రజ్ఞాన్‌ ఓఝా, సాయిరాజ్‌ బహుతులేలు ఉన్నారు.

ఈ టోర్నీలోమొత్తం 11 మ్యాచ్‌లు నిర్వహించను న్నారు. వాంఖడే మైదానంలో రెండు ఎంసిఎ స్టేడియంపూణెలో నాలుగు, నవీముంబైలోఇ డివై పాటిల్‌స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్‌మాత్రం బ్రాబౌర్న్‌ గ్రౌండ్‌లో జరుగుతుంది. మొత్తం మ్యాచ్‌ వచేచనెల ఏడవ తేదీనుంచి ఫైనల్స్‌ 22వ తేదీవరకూ జరుగుతాయి.

మొత్తం 11మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతి ఏటా రోడ్డుప్రమాదాల్లో మృతిచెందేవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 1.35 మిలియన్లు ఉండగా భారత్‌లోనే 1.49 లక్షలున్నాయి. దేశంలోప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డుప్రమాదంలోచనిపోతున్నారు. రోజుకు సరాసరి సుమారు 1214 మందిప్రమాదాల బారినపడిప్రాణాలు కోల్పోతున్నారు.

గడచిన ఐదేళ్లలో సుమారు 65 లక్షలమంది దివ్యాంగులయ్యారు. క్రికెట్‌కు ఆదరణ ఎక్కువగా ఉండటంతో అవగాహన కార్యక్రమాలు క్రికెట్‌ ద్వారానే నిర్వహించాలనినిర్ణయించారు. థానే ఆర్టీఓ చీఫ్‌ రవిగైక్వాడ్‌ ఈటోర్నీ గురించి మాట్లాడుతూ అభిమానులు పెద్దసంఖ్యలోపాల్గొంటారన్న ధీమా వ్యక్తంచేసారు. టోర్నమెంట్‌ షెడ్యూలు, టికెట్లకోసం ఇప్పటినుంచే డిమాండ్‌పెరిగింది. రహదారులను సురక్షితంగామార్చేందుకు వెటరన్‌ క్రికెటర్లు అందరూచేతులు కలిపి టోర్నీ ఆడటం విశేషం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/