నెల్లూరు లో నేడు జాబ్ మేళా ..

ఏపీలో వరుస జాబ్ మేళాలు నిరుద్యోగుల్లో సంతోషం నింపుతున్నాయి. స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో జాబ్ మేళా రాబోతుంది. మెడ్‌ ప్లస్‌, డీ మార్ట్, ఎస్బీఐ లైఫ్‌ తదితర సంస్థల్లో ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ మేళాను ఈరోజు ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరంలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలు చూస్తే..

  • డీ మార్ట్ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది.
  • ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో 15 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.2.35 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
  • మెడ్ ప్లస్‌ సంస్థలో మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. D/B/M ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,234 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.
  • గ్రీన్ టెక్ సంస్థలో అత్యధికంగా 450 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లించున్నారు. ఎంపికైన వారు నాయిడుపేటలో పని చేయాల్సి ఉంటుంది.