గుడ్​న్యూస్.. లీటర్​ పెట్రోల్​పై రూ.25 తగ్గింపు..

వాహనదారులకు తీపి కబురు తెలిపింది ఝార్ఖండ్ ప్రభుత్వం. మోటార్​సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్​ కొట్టించేవారికి లీటరుకు రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ రాయితీ జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్. హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం తో.. వాహనదారులకు భారీ ఊరట కలుగనుంది. అటు ఝార్ఖండ్‌ వాహనాదారులు కూడా హేమంత్‌ సోరెన్‌ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా… ఇప్పటికే ఒడిషా, ఢిల్లీ, కర్ణాటక, అస్సాం లాంటి చాలా రాష్ట్రాలు.. పెట్రోల్‌ మరియు డీజిల్‌ పై ధరలనున తగ్గిస్తూ… నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అన్ని రాష్ట్రాల కంటే.. ఝార్ఖండ్‌ మాత్రం రూ. 25 తగ్గించడం గమనార్హం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరు రూ. 95.41 పలుకుతుండగా, డీజిల్ లీటర్ రూ.86.67 గా ఉంది. ముంబయిలో పెట్రోల్ లీటరు రూ.109.98 ఉండగా, డీజిల్ ను రూ. 94.14కు విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62కు విక్రయిస్తున్నారు.