హైద‌రాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన బీజేపీ తెలంగాణ నేత‌లు

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాసేప‌టి క్రితం హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యమ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన నేత‌లు సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు.

మ‌రికాసేప‌ట్లో ఆయన సీఎఫ్ఎస్ఎల్ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్క‌డ‌ కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ నేష‌న‌ల్ సైబ‌ర్ ఫోరెన్సిక్ ల్యాబోరేట‌రీని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. ఆ త‌ర్వాత తెలంగాణ బీజేపీ కోర్ క‌మిటీ నేత‌ల‌తో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత తుక్కుగూడ‌లో జ‌ర‌గ‌నున్న బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. ఆ కార్య‌క్ర‌మం తర్వాత అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప‌య‌న‌మ‌వుతారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/