రాహుల్ కు షాక్ ఇచ్చిన జార్ఖండ్ కోర్ట్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష కు గురయ్యాడు రాహుల్. అంతే కాకుండా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు కూడా పడింది. ఈ అనర్హత వేటు వేయడాన్ని యావత్ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..రాహుల్ కు మద్దతు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాహుల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో మూడు కేసుల్లో విచారణకు హాజరు కావాలని కోరుతూ జార్ఖండ్ దిగువ కోర్టులు సమన్లు జారీ చేశాయి. మోడీ వంశంపై చేసిన వ్యాఖ్యలకు గాను ఓ కేసు నమోదు కాగా.. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గాను మిగిలిన రెండు కేసులు నమోదయ్యాయి. మరి వీటి ఫై రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన ట్విట్టర్ బయోని ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’గా మార్చిన రాహుల్.. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలైట్ చేయడానికి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను వేదికగా మార్చుకున్నారు. తాజా పోస్ట్‌లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అంత్యక్రియల విజువల్స్ ను పంచుకున్నారు. ఆయన భౌతిక కాయాన్ని మోస్తూ రాహుల్ ఆర్మీ ట్రక్కు వెనుక నడిచిన సంఘటనను గుర్తు చేస్తూ ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగాన్ని షేర్ చేశారు. దీనికి నిజం, ధైర్యం, త్యాగం – ఇది మా వారసత్వం, ఇదే మా బలం అని క్యాప్షన్ ఇచ్చారు.