కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ నలుగురు ఉగ్రవాదుల హతం
ముగ్గురు సైనికులకు గాయాలు

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం..జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా పింజోరా ప్రాంతంలో సోమవారం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, సైనికులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం మేర సోమవారం షోపియాన్ పోలీసులు సైనికులతో కలిసి గాలింపు చేపట్టారు. సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈఘటనలో ముగ్గురు సైనిక జవాన్లు కూడా గాయపడ్డారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు. కాగా పింజోరాకు 12 కి.మీ. దూరంలో ఉన్న రెబన్ గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్‌కౌంటర్ సుమారు 12 గంటలపాటు కొనసాగిందని అధికారులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/