పుష్ప నుండి సరికొత్త పోస్టర్ రిలీజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపి సంతోషం నింపింది.

ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఒకే ఫ్రెమ్ లో హీరో బన్నీ అలాగే విలన్ ఫాహద్ ఫసిల్ ఉన్న పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మధ్య అదిరిపోయే సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుందని.. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య అంతిమ పోరును వెండితెరపై డిసెంబర్ 17న చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు మేకర్స్.

Gripping scenes between @alluarjun & #FahadhFaasil are being shot 🔥

Witness the ultimate Face-Off between #PushpaRaj & #BhanwarSinghShekhawat on Big Screens From 17th DEC 2021.#PushpaTheRise #ThaggedheLe 🤙@iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/togtU9OTpb— Pushpa (@PushpaMovie) October 4, 2021