జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ వాయిదా

న్యూఢిల్లీ : ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ(JEE) అడ్వాన్స్‌డ్ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 11) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనుంది. ఈ మేరకు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. ఫీజు చెల్లింపునకు మాత్రం ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 వరకు గడువు ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 3న జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

దీనిప్రకారం ఆగస్టు 13న (సోమవారం) దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్‌ గడువు ముగుస్తుంది. సెప్టెంబర్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించవచ్చు. పరీక్ష మాత్రం అక్టోబర్‌ 3న యధాతథంగా జరగనుంది. జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఆది లేదా సోమవారాల్లో వెలువడే అవకాశం ఉంది. కాగా, మెయిన్‌ క్వాలిఫై అయిన 2.5 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి వీలుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/