మూడో రోజు కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష

జిల్లా కలెక్టర్, రీజనల్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.. దీక్షా శిబిరం దగ్గరకి రావాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నేటికీ జేసీ దీక్ష మూడోరోజుకు చేరుకుంది. పోలీసుల తీరును, కమిషనర్ అక్రమాలను నిరసిస్తూ ప్రభాకర్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున మునిసిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని రోడ్డుపైనే దీక్షకు దిగారు. రోడ్డుపైనే స్నానం చేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి నిరసన కొనసాగించారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న మునిసిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని కౌన్సిలర్లు హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో దీక్ష చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున చేరుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆరు బయట నిద్రిస్తున్నారు. ఉదయం వేళ బయటే స్నానం చేసి మళ్లీ శిబిరంలో నిరసన కొనసాగిస్తున్నారు జేసీ.