పిలేట్స్ క్లాస్ ముగించుకుని వడివడిగా..

జాన్వీ కపూర్ స్టైలిష్ లుక్

Janhvi Kapoor coming from Pilates class

తాజాగా పిలేట్స్ దినచర్య అనంతరం జాన్వి తన కారు వైపు వెళుతూ కెమెరాల నుంచి చకచకా దూరమవ్వడం కనిపించింది. తన పిలేట్స్ క్లాస్ తో తన రోజును ప్రారంభించి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజా ఫోటోషూట్ లో ఆరెంజ్ క్రాప్ టాప్ లో వైట్ జాగర్ షార్ట్స్ ధరించి కనిపించింది. అంతేకాదు , మాస్కు ధరించింది. ఫోటోగ్రాఫర్ల కోసం ఆగకుండా జాన్వి త్వరగా తన పిలేట్స్ క్లాస్ నుండి నిష్క్రమించి తన కారు వైపు వెళ్లింది. కార్ డోర్ తెరిచేటప్పుడు పాజ్ చేసి చిరునవ్వుతో ఫ్లాష్ ల వైపు చూసింది. ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. ‘దోస్తానా 2’ లో నటిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/